ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఈసీ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం' - ఈసీ

జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామని బుద్దా వెంకన్న తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. బెయిల్ రద్దుకు హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

బుద్దా వెంకన్న

By

Published : Mar 27, 2019, 10:55 PM IST

బుద్దా వెంకన్న
వైకాపా నేతలు జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిబెయిల్​పై బయటతిరుగుతూ ప్రజలను భయపెడుతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. వైకాపా నేతల బెయిల్ వెంటనే రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. తమ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని బుద్దా వెంకన్న అన్నారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి మరణాన్నే రాజకీయం చేసిన జగన్... ప్రజలకు ఎటువంటి పాలన అందిస్తారని ప్రశ్నించారు.వీరు ప్రజల మధ్య ఉండడం మంచిది కాదని వెంకన్న అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details