ప్రత్యేక హోదాను కేంద్రం ఏ రాష్ట్రానికైనా ప్రకటిస్తే...ముందుగా ఏపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తామని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రత్యేక హోదాకు భాజపా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాధవ్...హోదా విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. హోదాకు, పారిశ్రామిక రాయితీలకు ఎటువంటి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయన్న మాధవ్...వాటిని తీర్చాకే సీఎం జగన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లాలన్నారు. ఏపీకి నికరజలాలు లేకుండా నిర్మిస్తోన్న కాళేశ్వరంపై జగన్ స్పష్టత ఇవ్వాలన్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని కొన్ని అంశాలు తప్ప మిగిలిన వాటినన్నింటిని భాజపా నెరవేర్చిందని వెల్లడించారు.
'కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయి' - ప్రత్యేక హోదా
ఏపీ ప్రత్యేక హోదాకు భాజపా వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. హోదా, పారిశ్రామిక రాయితీలకు ఎటువంటి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి నికర జలాలు లేకుండా తెలంగాణలో నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయన్నారు.
భాజపా ఎమ్మెల్సీ మాధవ్