ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

భాజపా నేతలు మోదీ బానిసలుగా ఉండకండి: ఖర్గే

లోక్​సభలో మోదీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు గుప్పించారు. భాజపా నేతలనుద్దేశిస్తూ మోదీ బానిసలుగా ఉండకండి అంటూ ఖర్గే హితవు పలికారు.

మల్లికార్జున ఖర్గే

By

Published : Feb 8, 2019, 1:45 AM IST

Updated : Feb 8, 2019, 6:42 AM IST

మల్లికార్జున ఖర్గే
అధికార మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్​ దుయ్యబట్టింది. అక్రమంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించి రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.

రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రపతి ప్రసంగంలో తప్పుడు గణాంకాలు చెప్పించి, భాజపా ప్రజలను మోసం చేసిందని ఆరోపించింది.

లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాన సమయంలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీకి గర్వం ఎక్కువైందని, అత్యంత ముఖ్యమైన విషయాల్లో సైతం సహచర మంత్రులతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. నిలువెల్లా ద్వేషంతో రగిలిపోతున్న మోదీ గతంలో కాంగ్రెస్ చేసిన మంచి పనులను గుర్తించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

కార్పొరేట్​ సంస్థలకు సుమారు రూ.1.10 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ ప్రభుత్వం రైతుల పంటరుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ఖర్గే మండిపడ్డారు.

దేశం అభివృద్ధి చెందుతోందని, జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా ఉందని భాజపా చెబుతోంది. అదే నిజమైతే దేశం నిరుద్యోగ సమస్యతో ఎందుకు కొట్టుమిట్టాడుతోందని ఖర్గే ప్రశ్నించారు.

'మీరు(భాజపా) తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. అయినా ఇంకా అబద్ధాలు మానలేదు. ప్రజలను తప్పుదారి పట్టించడం ఆపలేదు' -మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ నేత

కాంగ్రెస్ హయాంలో విద్యాభివృద్ధికి జరిగిన కృషిని ఖర్గే వివరించారు. కాంగ్రెస్​ పాలనలో సుమారు 37వేల కళాశాలలను స్థాపించామని, వాటిల్లోనే భాజపా నేతలు విద్యాబుద్ధులు నేర్చుకున్నారని, మోదీ ప్రభుత్వ హయాంలో ఎంతమాత్రం కాదని ఖర్గే ఎద్దేవా చేశారు.
భాజపా సభ్యులనుద్దేశించి మీరు మోదీకి 'బానిసలు'గా ఉండకండి అని ఖర్గే దుయ్యబట్టారు.

రఫేల్​ కుంభకోణంపై చర్చ చేయడానికి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం జరపాలని ఖర్గే డిమాండ్ చేశారు.

Last Updated : Feb 8, 2019, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details