తెదేపా రాకుంటే ఉన్న ఉద్యోగాలు సైతం పోయే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు. సముద్రతీరంలో రహదారి నిర్మించి హైవేలతో కలుపుతామని వెల్లడించిన సీఎం.. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మోదీని ఇంటికి పంపించడం తెదేపాతోనే సాధ్యమని పేర్కొన్న సీఎం...మోదీ, కేసీఆర్ రాష్ట్రానికి విరోధులన్నారు. ఏపీకి హోదా ఇస్తామని ఫెడరల్ ఫ్రంట్ మేనిఫెస్టోలో జగన్ పెట్టించాలని సవాలు చేశారు. దూబగుంటలో ట్రిపుల్ ఐటీ, కనిగిరిలో రూ.200 కోట్లతో గిడ్డంగి నిర్మించామన్న సీఎం...కనిగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
చంద్రబాబు హామీ... మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ - చంద్రబాబు
హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో పంపించినా..సంక్షేమం, అభివృద్ధి, దీర్ఘకాల ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎన్నికల ప్రచార సభకు హాజరైన బాబు...కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబు
ఇవీ చూడండిఅన్నదాత - సుఖీభవ: రెండో విడత నగదు విడుదల