అసోంలో మోదీకి నిరసనల స్వాగతం - గువహటి
ప్రధాని నరేంద్ర మోదీకి గువహటిలో నిరసన సెగ తగిలింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మోదీ గో బ్యాక్ అంటూ నినదించారు ఏఏఎస్‌యూ సభ్యులు.
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా కాగడాల నిరసన
గుహవటిలోని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు మోదీ వెళుతున్న సమయంలో విద్యార్థి సంఘం సభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ప్రధాని వాహనశ్రేణి గువహటి విశ్వవిద్యాలయం పరిసరాలకు చేరగానే నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. మోదీ గోబ్యాక్, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రద్దు చేయండి అంటూ నినదించారు.