ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

98 కేంద్రాలలో రాష్ట్రవ్యాప్తంగా నేడు ఐసెట్ - i cet exam

రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఐసెట్‌ను నిర్వహించనున్నట్లు ఏపీ ఐసెట్ కన్వీనర్ , ఎస్వీ విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజేంద్రప్రసాద్ తెలిపారు. పరీక్ష పూర్తైన తర్వాత సాంయంత్రానికి ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు.

ఏపీ ఐసెట్ ఛైర్మన్

By

Published : Apr 26, 2019, 5:14 AM IST

Updated : Apr 26, 2019, 7:00 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా 98 కేంద్రాల్లో నేడు ఐసెట్ జరగనుంది. 2 సెషన్ల కింద పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు తొలి పరీక్ష... మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు రెండో పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అన్ని పరీక్షల్లాగే నిమిషం నిబంధన కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇతర విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న పరీక్షలు నేడు వాయిదా వేసుకోవాల్సిందిగా ఆయా అధికారులను ఇప్పటికే కోరినట్లు ఆయన తెలిపారు. సాయంత్రానికే ప్రాథమిక కీ విడుదల చేస్తామని ఐసెట్‌ కన్వీనర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

Last Updated : Apr 26, 2019, 7:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details