ఓటు వేటు.. సులువు కాదు - ap ec
ఓటు హక్కును పరిరక్షించేందుకు ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ప్రస్తుతం ఆందోళన రేకెత్తిస్తోన్న ఫారం-7 వివాదాలకు ఎలాంటి పరిష్కారం చూపిస్తోంది? మరిన్ని వివరాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో మా ప్రతినిధి ముఖాముఖి.
ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గరపడుతోంది. ఓటర్లకు తెలియకుండానే జాబితాల్లోని పేర్లను తొలగిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లోను...ఫారం-7 దరఖాస్తులు చేయడం కలకలం రేపుతోంది. అయితే.. ఓట్ల తొలగింపు అంత సులువైన వ్యవహారం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. మూడు దశల్లో పరిశీలించాకేఓటు తొలగింపు సాధ్యమన్నారు. మరిన్ని వివరాలపై.. ద్వివేదితోమా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి.