ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం

నవ్యాంధ్ర ప్రదేశ్‌ రెండో సభాపతిగా తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ఎన్నికైన ఆయన... సభాపతిగా కొనసాగనున్నారు.

speaker seetaram

By

Published : Jun 13, 2019, 11:08 AM IST

Updated : Jun 13, 2019, 2:49 PM IST

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం

రాష్ట్ర శాసన సభాపతిగా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం తమ్మినేని సీతారాం ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమైంది. స్పీకర్‌ ఎన్నిక కోసం ప్రొటెం స్పీకర్‌ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు బుధవారం మధ్యాహ్నం ప్రకటన జారీ చేశారు. సీతారాం నామినేషన్‌ను 11మంది మంత్రులు, 19మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు సమక్షంలో అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు సీతారాం తన నామినేషన్‌ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, టి.వనిత, ఎమ్మెల్యేలు బి.ముత్యాలనాయుడు, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ ఉదయం 11 గంటలకు సభాపతిగా తమ్మినేని సీతారాం ఎన్నికైనట్లు ప్రకటించారు.తర్వాత ఆయన సభాపతి స్థానంలో కూర్చోనున్నారు. ఆపై స్పీకర్‌ ఎన్నిక పట్ల సభలో సభ్యులు వారి స్పందన తెలియపరిచారు. అభినందనలు తెలియజేశారు. ఉపసభాపతి ఎన్నికకు సంబంధించిన ప్రకటన ఇవాళే వెలువడనుంది. బాపట్ల నుంచి ఎన్నికైన కోన రఘుపతిని ఉపసభాపతి పదవికి వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రఘుపతి నామినేషన్‌ దాఖలు చేశాక సోమవారం ఆయన ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Last Updated : Jun 13, 2019, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details