సచివాలయంలోని మూడో బ్లాక్ లో తన ఛాంబర్లో మైనార్టీ శాఖ మంత్రిగా అంజాద్ బాషా బాధ్యతలుస్వీకరించారు. కడప జిల్లాలో మసీదులు, చర్చిలు మరమ్మత్తులు నిమిత్తం 3 కోట్ల 36 లక్షల రూపాయల ఇస్తూ తొలి సంతకం చేశారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎం చేయటం ఆనందంగా ఉందన్నారు. అవినీతిరహిత పాలన అందించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. పాలనలో రాజశేఖర్ రెడ్డిని మించేలా ఆయన పాలన ఉంటుందని అభిప్రాయపడ్డారు. వక్స్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. వక్స్ బోర్డుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం అభ్యున్నతికి వినియోగిస్తామని వెల్లడించారు.
డీప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించటం ఆనందంగా ఉంది : అంజాద్ బాషా - అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి
సచివాలయంలో బాద్యతలు స్వీకరించిన అంజాద్ బాషా... ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎం చేయటం ఆనందంగా ఉందన్నారు.
డీప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించటం ఆనందంగా ఉంది : అంజాద్ బాషా
TAGGED:
అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి