ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 11, 2019, 3:51 PM IST

ETV Bharat / briefs

2030లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​:మోదీ

గ్రేటర్​ నోయిడాలో జరిగిన పెట్రోటెక్​-2019 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశంలోని వివిధ రంగాల అభివృద్ధిపై ప్రసంగించారు మోదీ.

ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

భారతదేశం ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్​ రెండోస్థానానికి చేరుకుంటుందని గ్రేటర్​ నోయిడాలో జరిగిన పెట్రోటెక్​-2019 కార్యక్రమంలో మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

చమురు ధరల్లో ఒడుదొడుకులను నియంత్రించేందుకు కృషి చేయాలని ప్రధాని వెల్లడించారు. ఉత్పత్తిదారులు- వినియోగదారులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా భారత్​ నిలిచిందని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థలో భారత్​ అభివృద్ధిపై మోదీ హర్షం వ్యక్తంచేశారు.

ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

"ఇటీవల భారత్​​ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. తాజా నివేదిక ప్రకారం... 2030 నాటికి భారత్​ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశం ఉంది. ఇంధన​ వినియోగంలో మూడో అతిపెద్ద దేశం మనదే. విద్యుత్ వినియోగం దేశంలో ఏటా 5శాతం పెరుగుతోంది. విద్యుత్​ సంస్థలను భారత్​ ఆకర్షిస్తోంది. 2040 కల్లా విద్యుత్​ వినియోగం రెండింతలయ్యే అవకాశం ఉంది. విద్యుత్​ అన్ని ప్రాంతాలకు చేరుకుంది. ఈ ఏడాది.. సౌభాగ్య పథకంతో ప్రతీ నివాసాన్ని 100 శాతం విద్యుదీకరించడమే మా లక్ష్యం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఆదివారం ప్రారంభమైన పెట్రోటెక్-2019 రేపటితో ముగియనుంది. దేశచమురు-గ్యాస్​ రంగాల్లో ఇటీవల నెలకొన్న మార్కెటింగ్​, పెట్టుబడుల పెరుగుదలపై కార్యక్రమంలో నేతలు ప్రసంగిస్తున్నారు. భాగస్వామ్య దేశాల నుంచి 95 ఇంధనశాఖ మంత్రులు, 70 దేశాల నుంచి 7వేల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details