ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల చేతిలో 10 మంది నక్సలైట్లు హతమయ్యారు. నక్సల్స్ ఏరివేత చేపట్టిన పోలీసులు నక్సల్స్‌ను అంతమొందించారు. ఘటనా స్థలం నుంచి 11 ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో జిల్లా రిజర్వ్ గార్డు, ప్రత్యేక కార్య దళం పాల్గొన్నాయి. భైరంగఢ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.