ఉద్ధృతంగా ఫ్రాన్స్ నిరసనలు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటి వరకు 2 వేల మంది పచ్చ కోటు ఆందోళనకారులు గాయపడ్డారు. చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ మొదలైన ఆందోళనలు చినికి చినికి గాలి వానగా మారాయి. అధ్యక్షుడు మేక్రాన్ పదవి నుంచి వైదొలగాలని చేస్తోన్న నిరసనలు 12వ వారానికి చేరుకున్నాయి. తాజాగా మరోమారు వందల మంది నిరసనకారులు ఫ్రాన్స్‌లోని వివిధ నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
2018 నవంబర్ 17 లో మొదలైన ఆందోళనల్లో ఇప్పటి వరకు సుమారు 2 వేల మంది గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. నిరసనలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించినట్లు వెల్లడించింది.