పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షపై రాజకీయ దుమారం తీవ్రమవుతోంది. ఇప్పటికే మాటలయుద్ధానికి దిగిన తృణమూల్ కాంగ్రెస్, భాజపా... ఎన్నికల సంఘం వేదికగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ సహా మొత్తం 22 రాజకీయ పార్టీల ప్రతినిధుల బృందం నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. అదే సమయంలో... బంగాల్ వివాదాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు సంతకాలు చేసిన మెమోరండాన్ని ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని దీక్షలో మమత ప్రకటించారు.