ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

"ధర్నాలో పోలీస్​ కమిషనర్​ కూర్చోడమేంటి?"

బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ధర్నాలో పోలీస్​ కమిషనర్​ కూర్చోవడంపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

By

Published : Feb 4, 2019, 8:06 PM IST

Updated : Feb 4, 2019, 8:33 PM IST

మమత ధర్నాపై రవిశంకర్ విమర్శలు

రవిశంకర్ ప్రసాద్
శారదా కుంభకోణ దర్యాప్తునకు తృణమూల్ కాంగ్రెస్ అడ్డుపడుతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మమతాబెనర్జీతో పాటు పోలీస్ కమిషనర్​ ధర్నాలో కూర్చోవడాన్ని ఆయన ఆక్షేపించారు.

శారదా కుంభకోణ విచారణ తమ ప్రభుత్వంలో మొదలైంది కాదని రవిశంకర్ తెలిపారు. సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ధర్నాకు దిగడాన్ని తప్పుపట్టారు. నిందితుల్ని కాపాడేందుకే బంగాల్ ప్రభుత్వం సీబీఐకి అనుమతివ్వాల్సిందిపోయి మొకాలడ్డుతోందని ఆరోపించారు.

"తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ ప్రజాస్వామ్యం గొంతు కోస్తోంది. పంచాయతీ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా ప్రతిపక్షాల వాదనను వినిపించనీయటం లేదు. మమత ప్రభుత్వం శారద కుంభకోణ నిందితుల్ని రక్షించేందుకే దర్యాప్తు జరగకుండా అడ్డుపడుతోంది. కుట్ర కోణం ఉందన్న సుప్రీంకోర్టు ఆదేశాలనూ పెడచెవిన పెట్టి ధర్నా చేస్తోంది. సీబీఐ విచారణ చేపట్టింది రాజకీయ కక్షసాధింపు ధోరణితో కాదు, సమాఖ్య వ్యవస్థకు దర్యాప్తు వల్ల భంగం కలగట్లేదు. బంగాల్ ప్రభుత్వం , ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శారదా కుంభకోణాన్ని వెలికి తీయడానికి సహకరించటం లేదు."
రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి

Last Updated : Feb 4, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details