ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

పాపం పిల్ల చిరుత.. బ్యాగులో కుక్కేశారు! - leopard cub

నిండా నెల వయసు లేదు. కనీసం పరిగెత్తే శక్తి కూడా లేదు. అలాంటి ఓ చిన్నారి చిరుతను.. ఓ ప్రయాణికుడు కనికరం లేకుండా బ్యాగులో కుక్కేశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

chennai chiruta

By

Published : Feb 2, 2019, 5:14 PM IST

పేరుకు క్రూర మృగమైనా.. ఇంకా నిండా నెల వయసు లేదు. కనీసం పరిగెత్తే శక్తి కూడా లేదు. అలాంటి ఓ చిన్నారి చిరుతను.. ఓ ప్రయాణికుడు కనికరం లేకుండా బ్యాగులో కుక్కేశాడు. ఎవరి కంటా పడకుండా తనతో తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ అతని పన్నాగం పారలేదు. చెన్నై విమానాశ్రయ సిబ్బంది.. ఈ విషయాన్ని పసిగట్టేశారు. ప్రయాణికుడి బ్యాగేజ్ నుంచి చిరుతను కాపాడారు. బయటికి తీసి.. పాలు పట్టించేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న చిరుతను చూసిన వారంతా ఆవేదన చెందారు.

చిరుతకు సపర్యలు చేసిన విమానాశ్రయ సిబ్బంది.. చెన్నైలోని అరింగర్ అన్నా జూపార్కు అధికారులకు అప్పగించారు. ఆ చిరుతను పట్టుకెళ్లేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం తమిళనాడు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో గమనించిన జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుతను బ్యాగులో కుక్కినట్టే... పట్టుబడిన ప్రయాణికుడినీ బ్యాగులో కుక్కి, ఊపిరి ఆడకుండా చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details