ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

బడ్జెట్​లో రైతులకు పెద్ద పీట: పీయూష్​ గోయల్​ - రైతులు

మధ్యంతర బడ్జెట్​ను విమర్శించిన వారిపై ఎదురుదాడి చేశారు తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​.

finance minister

By

Published : Feb 1, 2019, 5:25 PM IST

దేశ చరిత్రలోనే తొలిసారి అన్నదాతకు పెద్దపీట వేస్తూ బడ్జెట్​ ప్రవేశపెట్టడం ఎంతో గర్వంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్​ గోయల్​ హర్షం వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స పొందుతున్న అరుణ్​ జైట్లీ స్థానంలో తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీయూష్​ గోయల్​ పార్లమెంటులో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. దేశంలోని పేదలు, మధ్యతరగతి వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. భాజపా హయాంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని చెప్పారు. రైతులు, మధ్యతరగతి, కార్మికుల్లో సరికొత్త ఉత్సాహం పెరిగి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు.

బడ్జెట్​పై విమర్శలు చేస్తున్న వారిపై పీయూష్​ ఎదురుదాడి చేశారు. ఏసీల్లో కూర్చునే వారికి పేదల కష్టాలు తెలియవని ఎద్దేవా చేశారు.

piyus

"రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టడం ఈ తాత్కాలిక బడ్జెట్​లో విశిష్ఠత. ఒకటి అన్నదాతల కోసం, ఇంకోటి అసంఘటిత వర్గాల కోసం. దేశ చరిత్రలో రైతుల కోసం ఇంతకన్నా విశేషమైన పథకం ఇంతకు ముందెప్పుడూ ప్రకటించలేదు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారు ఏసీ గదుల్లో కూర్చుంటారు, రైతు వద్ద ఎకరం ఉందా అరెకరం ఉందా అన్న వాస్తవాలు వారికి తెలియదు. "
--- పీయూష్​ గోయల్​, కేంద్ర ఆర్థిక మంత్రి​.

ABOUT THE AUTHOR

...view details