ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

బడ్జెట్​ గురించి తెలుసుకోవాల్సినవి...

ఇవాళ కేంద్రం బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణంగా బడ్జెట్​ అంటే ఎన్నో అంశాలు, మరెన్నో లెక్కలు. బడ్జెట్​ను అర్థం చేసుకోవటానికి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు మీకోసం...

మధ్యంతర బడ్జెట్

By

Published : Feb 1, 2019, 7:48 AM IST

⦁ ఆర్థిక సర్వే: సంవత్సరం మొత్తం సాధించిన ఆర్థిక పురోగతి, సాధించిన విజయాలను ప్రకటించే దస్త్రమే ఆర్థిక సర్వే. ఇందులో జాతీయ ఆదాయం, రంగాల వారీ వాటా, రంగాల వారీగా సాధించిన వృద్ధి లాంటి లెక్కలుంటాయి.

⦁ మధ్యంతర బడ్జెట్​ : మధ్యంతర బడ్జెట్​ సంవత్సరంలో కొంత కాలానికే పరిమితం. ఇందులో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చుపై మాత్రమే దృష్టి సారిస్తుంది. ఆదాయం ప్రతిపాదనలు ఉండవు. చట్టపరంగా ప్రభుత్వానికి ఎలాంటి పరిమితులు లేకపోవటం విశేషం.

⦁ ఓట్​ ఆన్​ అకౌంట్​ : రాజ్యాంగంలోని ఆర్టికల్​ 266 ప్రకారం ప్రభుత్వం చేసే ఖర్చుకు పార్లమెంటు అనుమతి తప్పనిసరి. బడ్జెట్​ ఆమోదం పొందే వరకు ప్రభుత్వం చేసే ఖర్చుకు పార్లమెంటు అనుమతి కోసం ప్రవేశ పెట్టేదే ఓట్​ ఆన్​ అకౌంట్​. ఇది స్వల్ప కాలానికే పరిమితం.

⦁ ఫైనాన్స్​ బిల్లు : కొత్త పన్నుల విధింపు, అమల్లో ఉన్న వాటి రద్దు, పునరుద్ధరణ, పన్నుల తగ్గింపు- పెంపు తదితర పన్ను సంబంధిత ప్రతిపాదనలు ఇందులో ఉంటాయి.

⦁ ఫైనాన్సియల్​ స్టేట్​మెంట్​ : రాబోయే సంవత్సరంలో వచ్చే ఆదాయం, చేసే వ్యయం అంచనాలు ఇందులో ఉంటాయి. ఇందులో గత సంవత్సరం వాస్తవ ఖర్చును ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇందులో సంఘటిత నిధి, అత్యవసర నిధి, పబ్లిక్​ ఖాతా అనే భాగాలుంటాయి.

⦁ రెవెన్యూ బడ్జెట్​: ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయంతో పాటు... ప్రభుత్వం రోజువారీ కార్యక్రమాలకు అయ్యే ఖర్చుకు సంబంధించినదే రెవెన్యూ బడ్జెట్​. ఒక వేళ ప్రభుత్వం చేసే ఖర్చు ఎక్కువగా ఉండి ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గిపోతే దానిని రెవెన్యూ లోటుగా పరిగణిస్తారు.

⦁ ముూలధన బడ్జెట్​ : దీర్ఘకాలంలో ఆస్తుల సృష్టి కోసం చేసేదే మూలధన ఖర్చు. ప్రభుత్వం తీసుకునే రుణాలు, రుణాల రికవరీ, విదేశాల నుంచే వచ్చే గ్రాంట్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చేదే మూలధన ఆదాయం. మూలధన ఖర్చు, ఆదాయం రెండింటిని కలిపి మూలధన బడ్జెట్​గా వ్యవహరిస్తారు.

⦁ ద్రవ్య లోటు: ప్రభుత్వం చేసే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువుంటే, ఆ వ్యత్యాసాన్ని ద్రవ్య లోటు అంటారు.

⦁ బడ్జెట్​ దస్త్రాలు: బడ్జెట్​లో భాగంగా ఆర్థిక మంత్రి పార్లమెంటు మందుంచే పత్రాలు. ఇందులో బడ్జెట్​ ప్రసంగం, వార్షిక ఆర్థిక స్టేట్​మెంట్​, డిమాండ్స్​ ఆఫ్​ గ్రాంట్స్​, మ్యాక్రో-ఎకనామిక్​ ఫ్రేమ్​వర్క్​, ఆర్థిక విధాన వ్యూహ స్టేట్​మెంట్​, వ్యయ బడ్జెట్​, ఆదాయ బడ్జెట్​ తదితర దస్త్రాలుంటాయి.

ABOUT THE AUTHOR

...view details