శారదా రోజ్ వాలే, పోన్జి చిట్ ఫండ్ కుంభకోణం గురించి చాలా ఏళ్లుగా వింటున్నాం. ఈ కుంభకోణంలో మదుపరులు మొత్తం 20వేల కోట్ల వరకు నష్టపోయి ఉంటారని అధికారిక అంచనా. కొన్ని అనధికారిక అంచనాల ప్రకారం ఈ కుంభకోణం రూ.40 వేల కోట్లు పై మాటే. అసలు ఏంటీ శారదా కుంభకోణం?
ఎలా మొదలైంది?
పిరమిడ్ పథకం లాంటి డబ్బు డిపాజిట్ పథకం, బహుళస్థాయి(మల్టీ లెవల్) మార్కెటింగ్ లాంటిదే ఈ పోన్జీ కుంభకోణం కూడా. మొదటి తరంలో వీటిలో మదుపు చేసిన వారికి నిర్వాహకులు పెద్ద మొత్తాల్లో మొదటి నెల వడ్డీలు చెల్లించారు. కంపెనీలు వీటిని లాభాలుగా అభివర్ణించాయి. మొదట్లో కంపెనీలు మదుపు చేసిన మొత్తంలో 30 నుంచి 40శాతం లాభాలను తిరిగిచ్చేవి. ఇందులో మదుపు చేయడం ద్వారా బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేట్లను పొందేవారు.