national

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 7:30 PM IST

DSC_Cancel_Orders_Issued
DSC_Cancel_Orders_Issued (ETV Bharat)

DSC Cancel Orders Issued: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తక్కువ పోస్టులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో కేవలం 6 వేల 100 పోస్టుల భర్తీకి సిద్ధమవగా నూతన ప్రభుత్వం 16వేలకు ఉద్యోగాలతో మెగా డీఎస్సీ ప్రకటించింది. పాత డీఎస్సీ రద్దు చేసిన ప్రభుత్వం, త్వరలోనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది.

ABOUT THE AUTHOR

...view details