One Died in Parawada Pharma City Accident :అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ పరవాడ సినర్జీన్ సంస్థలో మరో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఝార్ఖండ్‌కు చెందిన రోయా అంగీరియా (21)గా గుర్తించారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు.
పరవాడ సినర్జీన్ సంస్థ ప్రమాదంలో ఒకరు మృతి - ముగ్గురికి చికిత్స
One Died in Parawada Pharma City Accident (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2024, 5:22 PM IST
ప్రమాదం ఎలా జరిగింది :గురువారం అర్ధరాత్రి రవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన విశాఖలోని ఇండస్ ఆసుపత్రికి తరలించారు.