national

ETV Bharat / snippets

హత్యా రాజకీయాలకు పేటెంట్ వైఎస్సార్సీపీదే: మంత్రి గొట్టిపాటి రవికుమార్

minister_gottipati_ravi_fire_on_jagan_fake_propaganda_on_vinukonda_murder
minister_gottipati_ravi_fire_on_jagan_fake_propaganda_on_vinukonda_murder (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 12:42 PM IST

Minister Gottipati Ravi Fire On Jagan Fake Propaganda On Vinukonda Murder :రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందనే విధంగా జగన్ కుట్రలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. అలాంటి ఆటలు చంద్రబాబు వద్ద సాగవన్న విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే దాన్ని తమ ప్రభుత్వానికి ఆపాదించడం వైఎస్సార్సీపీ దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వివాదాన్ని రెచ్చగొట్టేందుకే జగన్ వినుకొండ పర్యటన చేపట్టారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు పేటెంట్ వైఎస్సార్సీపీ దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడని విమర్శించారు. బాబాయిని చంపించి తెలుగుదేశంపై నెపం నెట్టి హత్యా రాజకీయాలు చేసింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం ఎవరినైనా లేపేసే చరిత్ర వైఎస్సార్సీపీ నేతలదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details