జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే : మంత్రి అనగాని
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 3:33 PM IST
Minister Anagani Satyaprasad Fires on EX CM YS Jagan :జగన్ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు పంగనామాలు పెట్టిన జగన్కు చంద్రబాబును విమర్శించే నైతికత లేదని ధ్వజమెత్తారు. జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే అన్ని వ్యవస్థలూ విఫలమయ్యాయంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఆకలి మంటలతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.