Chandrababu House Attack Case : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవ్వరూ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వారు సహకరించనందున వీరికి ఇచ్చిన రక్షణను తొలగించాలని అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈరోజు వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ను మంగళగిరి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీకృష్ణ సుమారు రెండు గంటల పాటు విచారించారు.
"27 ప్రశ్నలకు ఒక్క సమాధానం లేదు" - చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో దర్యాప్తునకు సహకరించని జోగి రమేశ్
Chandrababu House Attack Case (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2024, 5:17 PM IST
జోగి రమేశ్‌ను దాదాపు 27 రకాల ప్రశ్నలను అడిగామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. దేనికీ ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికీ నిందితులు సెల్ఫోన్లు సమర్పించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని మురళీకృష్ణ వెల్లడించారు.