అయ్యో పాపం!! - తలలో పెన్ను గుచ్చుకొని చిన్నారి మృతి
Published : Jul 3, 2024, 12:06 PM IST
![అయ్యో పాపం!! - తలలో పెన్ను గుచ్చుకొని చిన్నారి మృతి Four Year Old Girl Died After A Pen Pierced Her Head](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21856947-thumbnail-16x9-khammam.jpg)
Four Year Old Girl Died After A Pen Pierced Her Head : తలలో పెన్ను గుచ్చుకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలం సుభాశ్ నగర్ కాలనీలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం భద్రాచలం సుభాశ్ నగర్ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి మంచంపై పెన్నుతో ఆడుకుంటుంది. ప్రమాదవశాత్తు మంచంపై నుంచి కిందకు పడిపోవడంతో తలలో పెన్ను గుచ్చుకొని తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.