national

అక్రమ మైనింగ్ కేసు - ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 3:35 PM IST

BRS MLA Gudem Mahipal Reddy on Tuesday appeared before the ED
MLA Mahipal Reddy At ED Office (ETV Bharat)

MLA Mahipal Reddy At ED Office : అక్రమ మైనింగ్ ఆరోపణలపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. గతవారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు తన సోదరుడి ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి. రెండు రోజులపాటు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు, 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించారు. సంతోశ్​ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేస్తూ, రూ.39 కోట్ల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్​లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్​తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details