national

భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం - అదుపులోకి రాని మంటలు

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 9:46 PM IST

Thermal Power Plant Fire Accident in Bhadradri
Bhadradri Thermal Power Plant Fire Accident (ETV Bharat)

Bhadradri Thermal Power Plant Fire Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు భద్రాద్రి ధర్మల్ పవర్‌ స్టేషన్‌లోని ఒకటో యూనిట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ ఓ ట్రాన్స్​ఫార్మర్​లో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఘటనలో ఎవరికైనా హాని జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details