AP EX CM YS Jagan Oath in Assembly 2024: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ప్రమాణం చేసేందుకు అసెంబ్లీలోకి వెనక మార్గం నుంచి వచ్చారు.
అసెంబ్లీ వెనక గేటు నుంచి వచ్చి ప్రమాణం చేసిన వైఎస్ జగన్
Published : Jun 21, 2024, 11:43 AM IST
![అసెంబ్లీ వెనక గేటు నుంచి వచ్చి ప్రమాణం చేసిన వైఎస్ జగన్ YS Jagan Oath 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-06-2024/1200-675-21760458-thumbnail-16x9-jagan.jpg)
AP EX CM YS Jagan Oath (ETV Bharat)
అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి బయట నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. సభ ప్రారంభమైన 5 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అసెంబ్లీలో కూర్చోకుండా తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు.