AP Assembly Legislature adjourned indefinitely 2024 : ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు జరిగిన 16వ శాసనసభ సమావేశాలు ముగిశాయి. తొలి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 171 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
Published : Jun 22, 2024, 2:12 PM IST
![ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా AP Assembly Legislature adjourned indefinitely](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2024/1200-675-21769707-thumbnail-16x9-ap-assembly.jpg)
AP ASSEMBLY SESSIONS 2024 (ETV Bharat)
అనంతరం శాసనసభా పతిగా అయ్యన్నపాత్రుడును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండో రోజు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది. రెండో రోజు సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.