పారిస్ ఒలింపిక్స్‌లో తొలి డోపింగ్ కేసు - ఎవరు చిక్కారంటే?
Published : Jul 27, 2024, 3:29 AM IST
Paris olympics 2024 Doping Case Iraqi judoka : పారిస్ ఒలింపిక్స్ 2024లో అప్పుడే తొలి డోపింగ్ కేసు నమోదైంది. ఈ విశ్వక్రీడలు ప్రారంభమై ఒక్క రోజైనా పూర్తి కాలేదు అప్పుడే డోపింగ్ కేసు బయటపడింది. ఇరాక్ జుడోకా సజాద్ సెహెన్ డోపింగ్ పరీక్షల్లో నిర్వాహకులకు చిక్కాడు. అతడు రెండు రకాల నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు డోపింగ్ టెస్ట్‌లో తేలింది. అనాబోలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నాడట. దీంతో సెహెన్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. కాగా, అతడు మంగళవారం పురుషుల 81 కేజీ విభాగంలో పోటీ పడాల్సి ఉంది. కానీ ఇప్పుడతడు ఈ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి నిషేధానికి గురయ్యాడు.