David Johnson Died:టీమ్ఇండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ గురువారం మృతి చెందారు. బెంగళూరులోని తన అపార్ట్మెంట్ బయట ఆయన విగతజీవిగా కనిపించారు. అపార్ట్మెంట్ నాలుగో అంతస్థు నుంచి ఆయన పడిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనాస్థలంలో ఎలాంటి సూసైట్ నోట్ లభించలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మృతి- జైషా సంతాపం
Published : Jun 20, 2024, 3:42 PM IST
![టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మృతి- జైషా సంతాపం David Johnson Died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-06-2024/1200-675-21753906-thumbnail-16x9-jaishwa.jpg)
David Johnson Died (Getty Images)
'52 ఏళ్ల డేవిడ్ జాన్సన్ కోతనూర్ కనక శ్రీ లేఔట్‌లోని తన అపార్ట్మెంట్ పైనుంచి పడిపోయారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్య అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు కూడా లేరు' అని పోలీసులు తెలిపారు. కాగా, కొంతకాలంగా జాన్సన్ అనారోగ్యంతో బాధపడతున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, జాన్సన్ టీమ్ఇండియా తరపున 1996లో 2 టెస్టు మ్యాచ్‌లే ఆడాడు.