BRS VS Congress Competition Programs in Siddipet :సిద్దిపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ కార్యక్రమాలు చేపట్టాయి. రుణమాఫీ అంశం కార్యాచరణ ప్రకటన కోసం బీఆర్ఎస్ నేతలు సమావేశమైతే, రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహణకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. పొన్నాల నుంచి సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వరకు కాంగ్రెస్ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు.
సిద్దిపేటలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు - భారీగా మోహరించిన పోలీసులు
BRS VS Congress Competition Programs in Siddipet (ETV Bharat)
Published : Aug 20, 2024, 1:52 PM IST
పొన్నాల వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి, అక్కడి నుంచి ర్యాలీకి ప్లాన్ చేశారు. అనంతరం సిద్దిపేటలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్కడికి వెళ్లారు. ఇరు పార్టీల మధ్య పోటాపోటీ కార్యక్రమాలు ఉండటంతో సిద్దిపేటలో భారీగా పోలీసులను మోహరించారు. ఇటీవలే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు.