national

ETV Bharat / snippets

పసిడి, వెండి ఆభరణాల ఎగుమతులపై డ్రాబ్యాక్‌ రేట్ల తగ్గింపు

GOLD Jewellery
GOLD (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 5:25 PM IST

Govt Cuts Drawback Rates On Exports Of Gold, Silver Jewellery :పసిడి, వెండి ఆభరణాల ఎగుమతులపై డ్రాబ్యాక్‌ రేట్లను ప్రభుత్వం సగానికి పైగా తగ్గించింది. బడ్జెట్‌లో ఈ లోహాలపై దిగుమతి సుంకం భారీగా తగ్గించిన కారణంగా, ఆ మేరకు సర్దుబాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డ్యూటీ డ్రాబ్యాక్‌ అంటే, వస్తువుల దిగుమతుల సమయంలో చెల్లింపులు చేసిన దిగుమతి సుంకం, ఇతరత్రా పన్నుల నుంచి రీఫండ్‌ చేయడం. ఈ నిధులను ఎగుమతుల కోసం ఉత్పత్తులను తయారు చేసేందుకు కంపెనీలు తిరిగి ఉపయోగించుకుంటాయి. రెవెన్యూ విభాగం నోటిఫికేషన్‌ ప్రకారం, ఒక ఆభరణంలోని నికర పసిడి పరిమాణంలో ఒక గ్రాముకు డ్రాబ్యాక్‌ రేటు ప్రస్తుతం రూ.704.10 ఉండగా, దీనిని రూ.335.50కు పరిమితం చేశారు. వెండి పరిమాణంలో కిలోగ్రాముకు రూ.4,468కు తగ్గించారు. బడ్జెట్‌లో పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details