national

బంగారంపై పెట్టుబడి పెడితే ఫుల్ ప్రాఫిట్​ - అన్నింటి కంటే అదే టాప్​!

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 2:59 PM IST

Gold Mid Year Outlook 2024
Gold Mid Year Outlook 2024 (ANI)

Gold Mid Year Outlook 2024 : బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 12 శాతం మేర పెరిగి, మదుపరులకు అద్భుతమైన లాభాలను అందించాయి. అంతేకాదు లాభాలు అందించడంలో మిగతా ప్రధాన ఆస్తి తరగతులను బంగారం అధిగమించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్​ తన మిడ్​-ఇయర్​ ఔట్​లుక్​ 2024లో పేర్కొంది. సెంట్రల్ బ్యాంక్​ అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తుండడం, ఆసియా మార్కెట్లలో పెట్టుబడులకు మదుపరులు ఆసక్తి చూపుతుండడం, వినియోగదారుల డిమాండ్​ పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతుండడం మొదలైనవన్నీ బంగారం డిమాండ్ పెరగడానికి కారణమని తెలిపింది. మార్కెట్లలో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది. సాధారణంగా ఆసియా పెట్టుబడిదారులు బంగారం ధరలు తగ్గిన సమయంలో ఎక్కువగా పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో వారు మార్కెట్ ట్రెండ్స్​ను అనుసరిస్తున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details