national

ETV Bharat / snippets

నాలుగేళ్ల తర్వాత లద్ధాఖ్‌లో పెట్రోలింగ్ స్టార్ట్

India China Border Patrolling Agreement
India China Border Patrolling Agreement (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2024, 3:04 PM IST

India China Border Patrolling Agreement :తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌, చైనా బలగాలు సాధారణ పెట్రోలింగ్‌ను పునఃప్రారంభించాయి. 2020లో తలెత్తిన సైనికుల ప్రత్యక్ష ఘర్షణ కారణంగా నాలుగేళ్లుగా నిలిచిపోయిన పెట్రోలింగ్‌ పునఃప్రారంభమైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సైన్యాలు ముందస్తుగా సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాక దెప్సాంగ్‌, దమ్​చోక్​ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించుకున్నట్లు పేర్కొన్నాయి. రెండు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం గురువారం బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా చైనా, భారత్‌ సైనికులు నిన్న LAC వెంబడి గల ఐదు ప్రాంతాల్లో మిఠాయిలు కూడా పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details