LK Advani Hospitalised :భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీ(96) మళ్లీ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. మంగళవారం ఆయన్ను దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీకి మళ్లీ అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు
LK Advani Hospitalised (ANI)
Published : Aug 6, 2024, 4:09 PM IST
ప్రస్తుతం ఎల్కే ఆడ్వాణీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ చివర్లో కూడా ఆయన అనారోగ్యానికి గురవడం వల్ల ఎయిమ్స్‌లో చేర్చారు. యూరాలజీ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత జులై మొదటివారంలో మరోసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దిల్లీ అపోలో ఆస్పత్రిలో రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు.