ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్ సిద్ధం: కాసుకో మేము సిద్ధం- కోనసీమలో ఫ్లెక్సీ వార్ - కోనసీమలో ఫ్లెక్సీ వార్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 12:27 PM IST

YSRCP VS Janasena Flexi War in Mummidivaram: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ సాగుతోంది. తాజాగా కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అధికార, విపక్షాల మధ్య ఫ్లెక్సీల వార్ జరిగింది. అధినేతలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ప్రధాన రహదారులు పక్కన, మార్కెట్ కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టారు. 'సిద్ధం' అంటూ జగన్ చిత్రంతో వైసీపీ నేతలు, అభిమానులు రహదారిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి పోటీగా జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్‌ ఫొటోతో 'కాసుకో మేము సిద్ధమే' అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

College Leave for Jagan Siddham Meeting YSRCP Leaders in College Buses: ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభ కోసం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు సెలవులు ప్రకటించారు. కాలేజ్ బస్సుల్లో వైసీపీ కార్యకర్తలను, సామాన్యులను భారీ ఎత్తున సభకు తరలించారు. బస్సులకు కూడా సిద్ధం అంటూ ఫ్లెక్సీలు కట్టి నినాదాలు చేస్తూ తరలివెళ్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details