ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గ్రామాల్లో విలువే లేదు - వైఎస్సార్సీపీ సర్పంచుల అసహనం - నందిగామ మండల పరిషత్ సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 6:07 PM IST

YSRCP Sarpanches Impatience in Nandigama : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ సమావేశం వాడీవేడిగా జరిగింది. వైసీపీ, టీడీపీ సర్పంచు​లు, ఎంపీటీసీలు వారి సమస్యలపై అధికారులు నిలదీశారు. గ్రామాల్లో అధికారుల సమావేశం జరిగితే తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే వాలంటీర్లు అన్ని పనులు చేస్తున్నారని సర్పంచులు వాపోయారు. ఇంఛార్జ్ ఎంపీపీ ఆకుల హనుమంతరావు అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సభలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుడు సీతయ్యతో పాటు వైస్ ఎంపీపీ అన్నం పిచ్చయ్యలు సమస్యలపై అధికారులను నిలదీశారు. గ్రామాల్లో తమకు కనీస విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. 

ఏ పనులు చేద్దామన్నా నిధులు లేవని వాపోయారు. చివరికి దోమల మందు కూడా పిచికారి చేయలేకపోతున్నామని తెలిపారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు కూడా సమాచారం ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. మండల పరిషత్ సమావేశానికి గ్రామ సచివాలయ కార్యదర్శి, ఇతర అధికారులు ఎవరూ రావట్లేదని తెలిపారు. అటువంటి అప్పుడు సమావేశం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు జరుగుతున్న కూడా శంకుస్థాపనకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details