ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వీడియో వైరల్: ఇంటిముందు బోరువేసుకున్నావ్- పదివేలు కట్టు! వైసీపీ కార్పొరేటర్ దౌర్జన్యంపై యజమాని తీవ్ర ఆవేదన - YSRCP Leaders Harassment Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 9:52 PM IST

YSRCP Leaders Harassment Video: వైసీపీ నేతల వేధింపులు ఎంతగా స్థాయిలో ఉన్నాయో చూడండంటూ ఏ వీడియా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వైసీపీ నాయకుడు, కార్యకర్తలు కొంతమందిపై దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులే మీ పాలన అని, మీకు రోజులు దగ్గర పడ్డాయంటూ బాధితుడు అందులో అంటున్నాడు. పేద ప్రజలను హింసిస్తున్నారని వాపోయాడు. 

ఇంటి ముందు తాగునీటి బోరు వేసుకుంటున్న తమపై వైసీపీ కార్పొరేటర్‍ డబ్బులు చెల్లించాలని దాడికి పాల్పడుతున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరలయ్యాయి. తిరుపతి నగరంలోని 45వ డివిజన్​లో కార్పొరేటర్‍ అనీష్​తో పాటు మరి కొందరు కలిసి తనపై దాడికి పాల్పడుతున్నారంటూ రాజేంద్ర అనే వ్యక్తి ఆవేదనకు గురవుతున్న దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బోరు వేసుకుంటే పది వేల రూపాయలు చెల్లించాలని కార్పొరేటర్‍ తన అనుచరులతో వచ్చి దాడి చేయడమేంటని రాజేంద్ర ఓ వైపు ప్రశ్నిస్తుంటే మరో వైపు యువకులు దాడి చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details