ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పోలింగ్ రోజు టీడీపీ నేతపై వైఎస్సార్​సీపీ నాయకుడు దాడి - జిల్లా బహిష్కరణ - Expulsion From District - EXPULSION FROM DISTRICT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 4:27 PM IST

YSRCP Leader Srinivas Reddy Eexpelled from District by Police: ఎన్నికల పోలింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వైఎస్సార్​సీపీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డిపై పోలీసులు జిల్లా బహిష్కరణ విధించారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపులలో వైఎస్సార్​సీపీ నేత శ్రీనివాస్ రెడ్డిని ఈ నెల 30 వరకు పోలీసులు జిల్లా బహిష్కరణ విధించారు. గత నెల 13న పోలింగ్ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం నాయకుడు విజయ్ కుమార్ రెడ్డిపై శ్రీనివాస్ రెడ్డి దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకున్న వివాదంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు తెలుగుదేశం నాయకుడిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై అదే రోజున శ్రీనివాస్ రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓట్ల లెక్కింపు, అనంతరం శాంతిభద్రతలకు భంగం వాటిని లేకుండా ఉండేలా పోలింగ్ రోజున ఘర్షణకు కారణమైన శ్రీనివాసరెడ్డిని జిల్లా బహిష్కరణ చేశారు. గొడవలు ప్రేరేపించిన వైకాపా నాయకుడి తోపాటు, దాడికి గురైన టీడీపీ నేత విజయ్ కుమార్ రెడ్డిని జిల్లా బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details