నంద్యాలలో ఎటు చూసినా సిద్దం సభ బ్యానర్లే - సీఎం సారుకు ఎన్నికల కోడ్ వర్తించదా? - YSRCP Election Code Violation - YSRCP ELECTION CODE VIOLATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 3:48 PM IST
YSRCP Election Code Violation Siddham Flex in Nandyal : నంద్యాలలో వైఎస్సార్సీపీ నిర్వహించే మేమంతా సిద్ధం కార్యక్రమం సందర్భంగా రహదారికి ఇరువైపులా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలు వస్తున్నా వైఎస్సార్సీపీ నాయకులు (YSRCP leaders ) వాటిని పట్టించుకోలేదు. నంద్యాల (Nandyala) బొమ్మలసత్రం వంతెనపై వాహనదారులు ఇబ్బంది పడేలా ఫ్లెక్సీలు పెట్టారు.
Siddham Flexi : జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అట్టహాసంగా ప్రారంభించిన ఎన్నికల ప్రచారం తుస్సుమన్నా మళ్లీ ఎక్కడ సభ నర్వహించినా రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లు కట్టడం మాత్రం మారలేదు. ఇంటింటి ప్రచారాలు, పాంప్లెట్లు పంపడానికే సువిధ పోర్టల్లో (Suvidha Portel) రిజిస్ట్రేషన్ చేయించుకుని, అనుమతులు పొందాలని ఎన్నికల సంఘం పేర్కొంది. అయినప్పటికీ అధికార పార్టీకి ఆ ఆజ్ఞలేవీ పట్టడం లేదు. సభలు నిర్వహిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఎటు చూసినా సిద్దం బ్యానర్లు కట్టారు. నద్యాల మొత్తం బ్యానర్ల మయం అయిపోయింది.