ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం - election campaign in aasara program

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 9:17 PM IST

YSRCP Election Campaign in Government Program : ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు నాయకులకు ఆహ్వానం పలుకుతూ వారి చేతుల మీదుగా ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రత్తిపాడులో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ బలసాని కిరణ్​ కుమార్​ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్​కి, తనకు ఓటు వేయాలని డ్వాక్రా మహిళలను కిరణ్​ కుమార్​ వేడుకున్నారు. ఆసరా చెక్కుల పంపీణి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పాటలు పెట్టారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఆసరా కార్యక్రమానికి వేరే గ్రామాల నుంచి మహిళలను ఆటోల ద్వారా తరలించారు. ఈ కార్యక్రమానికి కిరణ్ కుమార్​ ఆలస్యంగా రావడం వల్ల కొంత మంది మహిళలు ఇంటి బాట పట్టారు. గ్రామాలలో తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేలా మహిళలకు చెప్పాలని యానిమేటర్లకు చీరలు కూడా పంపీణి చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details