'ఏం మొహం ఎట్టుకుని ఓటడగడానికి వచ్చారు?'- వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలదీసిన గ్రామస్థులు - YSRCP Ponnada Satish Kumar - YSRCP PONNADA SATISH KUMAR
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 2:59 PM IST
YSRCP Candidate Ponnada Satish Kumar People Protest in Konaseema District : కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది. అయిదేళ్ల కాలంలో ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదని గ్రామస్తులు అడ్డుకొని నిరసన తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది
గత ఎన్నికల్లో మూలపొలం గ్రామానికి తాగునీరు సౌకర్యం ఇస్తామని హామీ ఇచ్చి గాలి వదిలేశారని స్థానిక యువకులు మండిపడ్డారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి వదిలేశారని ధ్వజమెత్తారు. తాగునీరు లేక నాలుగు నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓటు అడగడానికి వచ్చావని స్థానికులు ప్రశ్నించారు. యువకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఇష్టముంటే ఓటేయండి లేకపోతే లేదంటూ అక్కడ నుంచి జారుకున్నారు.