సీబీఐ కోర్టుకు అవినాష్- వివేకా హత్య కేసు విచారణ వాయిదా - Viveka Murder Case
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 7:39 PM IST
YS Vivekananda Reddy Murder Case Postponed in CBI Court : హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసా వాయిదా పడింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేయగా దస్తగిరి పిటీషన్‌పై విచారణను జులై 11కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP YS Avinash Reddy), భాస్కర్ రెడ్డితో పాటు మిగతా నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
తనను సాక్షిగా పరిగణించాలంటూ కోర్టులో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పైనా (Petition filed by Dastagiri) కోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ దస్తగిరిని సాక్షిగా చేర్చారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. న్యాయమూర్తి వచ్చే నెల 11వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేయగా వివేకా హత్య కేసు విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేశారు.