పెచ్చుమీరుతున్న వైసీపీ నేతల ఆగడాలు - యువకుడు ఆత్మహత్యాయత్నం - Young Man Attempted Suicide
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 3:31 PM IST
Young Man Attempted Suicide Due to YCP Leader Harassment: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కందల్లపల్లిలో వైసీపీ నాయకుడి వేధింపులు తాళలేక బ్రహ్మతేజ కుమార్ అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితున్ని కుటుంబ సభ్యులు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గత కొన్ని నెలలుగా వైసీపీ సర్పంచ్ సోదరుడు గాయం వెంకటేశ్వరరెడ్డి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు వెల్లడించాడు. అధికార అండతో తనకున్న చిన్నపాటి ఉద్యోగం కూడా తీయించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
పొలం ఆన్లైన్ చేయడంతో పాటు దాడికి కూడా పాల్పడ్డాడని బాధితుడు బ్రహ్మతేజ వైద్యశాలలో చికిత్స పొందుతూ వెల్లడించాడు. అయినా తానేమీ అనలేదని చివరికు మంగళవారం తన భార్యను, తన కులాన్ని తీవ్రంగా అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్థాపానికి గురై పురుగుమందు తాగినట్లు తెప్పాడు. తాను టీడీపీ, జనసేన సానుభూతి పరుడుని అనే ఇలా తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.