ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తాగునీటి కోసం అర్జీ పెట్టుకోవాలా?- నీటి సమస్యపై బీజేపీ నేత ఫైర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 5:23 PM IST

YCP Leaders Not Solve Drinking Water Problem: కర్నూల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. నగరంలో నీటి సమస్యను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగరూరు రాఘవేంద్ర కర్నూలు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్​కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ కర్నూలులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై వైసీపీ నేతలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల పథకాల్లో తాగునీటిని కూడా చేర్చి ప్రజలు దరఖాస్తులు చేసుకుంటే నీటిని అందిస్తామని చెప్పండని ఎద్దేవా చేశారు.

BJP Leader Raghavendra Fires on YCP Government: కర్నూలులో ఉన్న సమస్యలపై ప్రతిపక్ష నేతలు కనీసం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటి కోసం అప్లికేషన్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే కర్నూల్లో దోమలు దండయాత్ర చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు తాగునీటి సమస్య కూడా ఉండటంతో నగర వాసులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు, అధికారులు స్పందించి నగరంలో సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details