ఎన్నికల కోడ్ను ఉల్లఘించిన వైసీపీ అభ్యర్థి - చర్యలకు ఈసీ ఆదేశం - Election Code Violation - ELECTION CODE VIOLATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 8:00 AM IST
YCP Leader Ambati Muralikrishna Election Code Violation : గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ముకేశ్ కుమార్ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. గత నెల 18న పొన్నూరు మండల పరిధి ములుకుదురులో కొంత మంది మహిళలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను (CMRF) అంబటి మురళీకృష్ణ పంపిణీ చేశారు
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ అభ్యర్థి చెక్కులు పంపిణీ చేయడంపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు అంబటి మురళీ ఎన్నికల కోడ్ ఉల్లఘించినట్లు నిర్థారించారు. దీంతో మురళీపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అంబటి మురళీపై ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఖండిస్తున్నారు.