ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పండన్నకు మూడో పెళ్లి- దగ్గరుండి జరిపించిన ఇద్దరు భార్యలు- వీడియో వైరల్ - Wives Did Third marriage to Husband - WIVES DID THIRD MARRIAGE TO HUSBAND

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 4:22 PM IST

Updated : Jun 30, 2024, 4:50 PM IST

Wives Did Third marriage to Their Husband: సాధారణంగా రెండో పెళ్లి చేసుకోవాలి అంటేనే విడాకులు కావాలని చట్టం చెబుతుంది. అయితే అవేవీ అవసరం లేకుండానే మూడో వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తి. కట్టుకున్న భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ మూడో పెళ్లి చేశారు. ఈ విచిత్ర వివాహం అల్లూరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

వివరాల్లోకి వెళ్తే: పండన్న అనే వ్యక్తికి 2000 సంవత్సరంలో మొదటి వివాహం జరిగింది. అయితే పండన్న మొదటి భార్యకు సంతానం లేదు. దీంతో అతడు 2005లో మరో వివాహం చేసుకున్నాడు. 2007లో ఒక కుమారుడు పట్టాడు. అయితే ఆ తర్వాత రెండో భార్యకూ పిల్లలు పుట్టలేదు. మరో బిడ్డ కావాలని భర్త కోరటంతో మూడో పెళ్లి చేసేందుకు భార్యలిద్దరూ సిద్ధం అయ్యారు. భార్యలే భర్త పెళ్లికి పెద్దలుగా మారి కార్డులు కొట్టించి, బ్యానర్లు వేయించి వారి పేర్లను కూడా కింద ముద్రించారు. కించూరులో జూన్​ 25వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. సంతానం కోసం తన భార్యలు త్యాగం చేశారంటూ పండన్న చెబుతున్నాడు. ఒక భార్యతోనే వేగలేని కొందరు భర్తలు, మూడో పెళ్లి చేసుకున్న ఈ పండన్నను చూసి ముక్కన వేసుకుంటున్నారు. 

Last Updated : Jun 30, 2024, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details