ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విజయావాడలోని ఓ బంకులో పెట్రోలుకు బదులు నీళ్లు-లబోదిబోమన్న వాహనదారులు - Water came instead of Petrol - WATER CAME INSTEAD OF PETROL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 3:22 PM IST

Water Instead of Petrol at Petrol Bunk: పెట్రోలు కొట్టించుకుని వెళ్లిన వారి వాహనాలు మధ్యలోనే ఆగిపోవడంతో పలువురు వాహనదారులు కంగుతిన్నారు. ఏమైందో అని మెకానిక్ దగ్గరకి వెళ్తే అసలు విషయం తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చాయని వాహనదారులు తెలిపారు. పెట్రోల్ కొట్టించుకొని బైటకు వెళ్లాక దారి మధ్యలో బైక్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మరమ్మతుల కోసం వాహనాన్ని మెకానిక్ వద్దకు తీసుకెళ్లే అందులో పెట్రోల్ బదులు నీళ్లు ఉన్నాయని చెప్పారని వివరించారు. 

ఇదేంటని బంకు యజమానిని నిలదీయగా ముందుగా తనకేం తెలియదు అంటూ బుకాయించారు. అయితే తర్వాత సుమారు 30 వాహనాలు ఒక్కసారిగా రావడంతో కంగుతిన్న సదరు బంకు యజమాని, వాహనాలను రిపేర్ చేయించి ఇస్తానని చెప్పారు. కాగా వాహనాలు ఇలా ఒక్కసారిగా ఆగిపోవడంపై వాహనదారులు లబోదిబోమంటున్నారు. సుమారు 30 వాహనాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు . మరెన్ని వాహనాలు వస్తాయో అన్న ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై బంక్ యజమానిపై కేసు నమోదు చేయాలని వాహన యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details