ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మా ఎమ్మెల్యే కనిపించడం లేదు- యర్రగొండపాలెంలో వాల్ పోస్టర్ల కలకలం - Wall Posters on Adimulapu Suresh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 4:27 PM IST

Wall Posters About Ministers Adimulapu Suresh : సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో గత కొంత కాలంగా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్క జిల్లాలకు, మరో నియోజకవర్గానికి తరలించింది. పాత నియోజకవర్గ ఓటర్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు వారిని కరివేపాకులా వాడేసుకుని వారికి మోహం చూపించకుండా చాటేస్తున్నారు. కొత్త ఓటర్లను బురిడి కొట్టించడానికి తాయిలాలతో వివిధ విశ్వ ప్రయత్నాలతో ముగినితేలుతున్నారు. అధికారం ఇచ్చిన ప్రజలను మాత్రం పట్టించుకోవడం మరచిపోయారు. ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. "2019 ఎన్నికల్లో మేము ఓటు గెలిపించిన ఎమ్మెల్యే, మంత్రి మాకు కనిపించడం లేదు." అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రజాప్రతినిధికి బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే,

జిల్లాలోని యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్​పై వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. "2019 ఎన్నికల్లో మేము ఓటు గెలిపించిన ఆదిమూలపు సురేష్ మాకు కనిపించడం లేదు. ఆచూకీ తెలిసిన వారు మాకు తెలియజేయగలరు." అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన కూడళ్లలో  పోస్టర్లు అంటించారు. ఇలా పలుచోట్ల పోస్టర్లు ఉండటంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా వైఎస్సార్సీపీ అధిష్టానం మంత్రి సురేష్​ను యర్రగొండపాలెం నుంచి కొండేపి ఇంచార్జ్​​గా తరలించారు. 2024 ఎన్నికలకు కొండేపి ఓట్లు రాబట్టుకోవడం కోసం అక్కడే నిమగ్నమైపోయారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details