ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆపత్కాలంలో ఆపన్న హస్తం - నిండు గర్భిణీకి వీఎంసీ సిబ్బంది చేయూత - VMC Staff Saved Pregnant - VMC STAFF SAVED PREGNANT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 4:55 PM IST

VMC Staff Saved Pregnant in Vijayawada : వరద బాధిత ప్రాంతంలో ఓ నిండు గర్భిణీని విజయవాడ నగరపాలక సంస్థ బృందం రక్షించారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన వాంబే కాలనీల్లో  ఓ గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరిలోనూ ఒకటే ఆందోళన. ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక దిక్కుచోచని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూమ్​కు సమాచారం అందించారు. దీంతో వీఎంసీ అధికారులు వెంటనే స్పందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

బాధితురాలిని వాంబే కాలనీ నుంచి సింగ్​ నగర్​ ఫ్లైఓవర్​కు​ తరలించే క్రమంలో ఆమె బోటులోనే ప్రసవించింది. అప్పటికే ఫైఓవర్​ వద్దకు విజయవాడ నగర పాలక సంస్థ బృందం అక్కడికి చేరుకున్నారు. అనంతరం తల్లి, బిడ్డను అంబులెన్స్​లో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపత్కాలంలో సహాయం  అందించిన వీఎంసీ సిబ్బందికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details